నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్.. కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్‌పై కేసు

by Naga Rani Yarlagadda |

నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ కేసులో (National Medical Scam Case) కీలక పరిణామం చోటు చేసుకుంది.

నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్.. కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్‌పై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ కేసులో (National Medical Scam Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ లో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ (Colombo Medical Hospital) పాత్ర ఉన్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. దీంతో కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డి జోసఫ్ పై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి, వాటికి అనుకూలంగా నివేదికలిచ్చేందుకు భారీగా లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ స్కామ్ లో 36 మందిపై కేసులు నమోదవ్వగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్లపై కూడా కేసులు నమోదు చేసింది సీబీఐ. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గఢ్ మెడికల్ కాలేజీ తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి.

ఛత్తీస్ గఢ్ కు చెందిన రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు, బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీల కోసం కొమ్మారెడ్డికి విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి రూ.50 లక్షలు అందినట్లు విచారణలో తేలింది. ఆ డబ్బును డాక్టర్ కృష్ణకిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో తరలించినట్లు సీబీఐ గుర్తించింది.

Next Story