- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీబీఐ, ఈడీని బీజేపీ జేబు సంస్థల్లా వాడుకుంటోంది.. టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు
సీబీఐ, ఈడీ లను బీజేపీ జేబు సంస్థల్లా వాడుకుంటోందని, కేవలం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకే ఈడీనీ ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Telangana Congress President Mahesh Kumar Goud) మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: సీబీఐ, ఈడీ లను బీజేపీ జేబు సంస్థల్లా వాడుకుంటోందని, కేవలం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకే ఈడీనీ ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Telangana Congress President Mahesh Kumar Goud) మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ (AICC Leader Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్లను ఈడీ చార్జీషీట్ లో చేర్చింది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు (Protests) చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలకు మద్దతుగా, బీజేపీ నేతల (BJP Leaders)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు అవుతుందని, అప్పటి నుంచి దాదాపు 95 శాతం ఈడీ కేసులన్నీ ప్రతిపక్షాల (Opposition Leaders)పైనే పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి నమోదైన ప్రతీ 100 కేసుల్లో 95 కేసులు ప్రతిపక్షాలపైనే ఉంటున్నాయని, ప్రతిపక్షాల పేర్లు లేకుండా ఈడీ చార్జీ షీట్లు దాఖలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక సీబీఐ (CBI), ఈడీ (ED)లను బీజేపీ తన జేబు సంస్థల్లా వాడుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను, సీనియర్ నాయకులను దగ్గరికి తీసుకోవడం కోసమే ఈడీని ప్రయోగిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు.






