CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అస్వస్థత.. హుటాహుటిన అపోలోకు తరలింపు

by Gantepaka Srikanth |

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌(CBI Director Praveen Sood) అస్వస్థతకు గురయ్యారు.

CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అస్వస్థత.. హుటాహుటిన అపోలోకు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌(CBI Director Praveen Sood) అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం శ్రీశైలం నుంచి వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులంతా ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. కాగా, ప్రవీణ్ సూద్ కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయడానికి వచ్చినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. నిన్న నగరానికి చేరుకున్న ఆయన హైదరాబాద్ జోన్ సీబీఐ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1న కేంద్రానికి అధికారికంగా లేఖ రాసింది. ఈ పరిణామం జరిగిన వెంటనే సీబీఐ డైరెక్టర్ స్వయంగా హైదరాబాద్‌కు రావడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story