పోలీస్ స్టేషన్‌లో పిల్లి పంచాయితీ.. దొంగను కొరికి పారిపోయిన క్యాట్

by Bhoopathi Nagaiah |

లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఓ పెంపుడు పిల్లి పంచాయితీ కలకలం రేపింది. పిల్లిని దొంగిలించాడని ఆరోపణలతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించగా, విచారణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

పోలీస్ స్టేషన్‌లో పిల్లి పంచాయితీ.. దొంగను కొరికి పారిపోయిన క్యాట్
X

దిశ, సికింద్రాబాద్: లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఓ పెంపుడు పిల్లి పంచాయితీ కలకలం రేపింది. పిల్లిని దొంగిలించాడని ఆరోపణలతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించగా, విచారణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, లాలాగూడ ప్రాంతానికి చెందిన యువతికి చెందిన పెంపుడు పిల్లిని ఓ వ్యక్తి దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బండి నంబర్ గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బండి నంబర్ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించిన పోలీసులు, అతడిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు.

ఈ సందర్భంగా యువతి తన పిల్లిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఆ వ్యక్తి ఆశ్చర్యకరమైన వివరణ ఇచ్చాడు. పిల్లిని తీసుకెళ్లిన తర్వాత అది తన చేతిని కొరికి పారిపోయిందని, ఇప్పుడు దానిని ఎక్కడ నుంచి తీసుకురావాలో తెలియదని తెలిపాడు. దీంతో యువతి, ఆ వ్యక్తి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధితురాలు పట్టుబట్టడంతో, ఆ వ్యక్తి కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాడు. చివరకు పోలీసులు ఇద్దరికీ నచ్చజెప్పి, ఆ వ్యక్తికి హెచ్చరిక జారీ చేసి పంపించారు.

Next Story