- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: తెలంగాణలో 'క్యాస్ట్' పాలిటిక్స్ హీట్.. కేటీఆర్, సీఎం రమేశ్ లకు కమ్మ నేత డెడ్ లైన్
కమ్మ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంలో కేటీఆర్, సీఎం రమేశ్ తీరుపై చర్చనీయాశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (MP CM Ramesh) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ విలీనం విషయంలో తనతో కేటీఆర్ (KTR) చర్చలు జరిపారని ఆరోపించిన సీఎం రమేశ్.. తనతో భేటీ అయిన సందర్భంగా కేటీఆర్ కమ్మ, రెడ్లను దారుణంగా తిట్టారని సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో డైలాగ్ వార్ మొదలైంది. కమ్మ సామాజిక వర్గం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్, కేటీఆర్ కు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) నుంచి డెడ్ లైన్ జారీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వివిధ అంశాలపై రాష్ట్రంలో పొలిటికల్ వేడి కొనసాగుతుండగా తాజాగా కమ్మ సామాజిక వర్గం విషయంలో 'క్యాస్ట్' పాలిటిక్స్ మరింత రాజకీయాన్ని మరింత రంజుగా మారుస్తోంది.
సాయంత్రం వరకు డెడ్ లైన్:
తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ (Jetty Kusuma Kumar) సీఎం రమేశ్, కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు నేతలు నిష్కారణంగా మా సామాజిక వర్గంపై నిందలు వేసి మా పట్ల అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఈ ఇద్దరు నేతలకు ఈ సాయంత్రం వరకు గడువు ఇస్తామని హెచ్చరించారు. సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఈ సాయంత్రం లోగా స్పందించాలని లేకపోతే మా కమ్మ నేతలను ఆయన తిట్టినట్టే భావిస్తామన్నారు. ఇక ప్రెస్ మీట్ లో కమ్మ ప్రజలపై అసభ్యకర పదాలను పదే పదే మాట్లాడుతూ మమ్మల్ని అవమానించారని, నిజంగానే కేటీఆర్ మా సామాజిక వర్గంపై ఆ రకంగా ఆరోపణలు చేసి ఉంటే వెంటనే ఆధారాలు చూయించాలని డిమాండ్ చేశారు. ఈ సాయంత్రం లోగా ఈ ఇద్దరు నేతలు స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం సత్తా ఏమిటో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రమేశ్ లబ్ధిపొందారు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడటం సరికాదన్నారు. కేటీఆర్ మరో సమాజికవర్గాన్ని కూడా కించపరిచేలా మాట్లాడారు అని చెప్పిన సీఎం రమేశ్ కమ్మ సామాజిక వర్గం విషయంలో మాత్రం కేటీఆర్ ఏ పదజాలంతో తిట్టారో మీడియాలో పదే పదే చెప్పడాన్ని ఖండిస్తున్నానన్నారు.
సీఎం రమేశ్ పై బీఆర్ఎస్ ఫైర్:
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సీఎం రమేశ్ మాటలను నమ్మేందుకు ఎవరూ చెవిలో పూలు పెట్టుకోలేదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఎన్టీఆర్ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి అంత ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆరే నని కేసీఆర్ కు ఏ కులం పట్ల ద్వేషం లేదన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఏడుగురు నాయకులకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. సీం రమేశ్ కమ్మల మధ్య తగువు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో మాట్లాడాలనుకుంటే కేసీఆర్ డైరెక్ట్ గా మాట్లాడతారు కానీ మధ్యలో సీఎం రమేశ్ ఎవరు అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు సీఎం రమేశ్ ను రాజకీయ విషయాల్లో నమ్మరన్నారు.






