- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha : కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష.. నాగర్‌కర్నూల్ ఎస్పీకి కవిత ఫోన్
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా కీలక విషయాలు పంచుకున్నారు. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పాము.. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పసి పాప మృతికి కారణమైన వారిపై చర్యలు..
పసి పాప మృతికి కారణమైన వారిపై BNS 106(1), BNS 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులవివక్షతో రజక కుటుంబంపై దాడి చేసి పసి బిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీతో ఫోన్‌లో డిమాండ్ చేశామని వెల్లడించారు.






