Caste Census : నేడు కేబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక

by Y. Venkata Narasimha Reddy |

రాష్ట్ర ప్రభుత్వం(State Government)ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన(Caste Census)సర్వే నివేదికను నేడు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్(Planning Department) ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానీయ బృందం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub-Committee)కి అందజేయనున్నారు.

Caste Census : నేడు కేబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం(State Government)ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన(Caste Census)సర్వే నివేదికను నేడు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్(Planning Department) ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానీయ బృందం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub-Committee)కి అందజేయనున్నారు. సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కమిటీ కో చైర్మన్ దామోదర్ రాజా నరసింహ, సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు హాజరయ్యే సమావేశంలో సందీప్ సుల్తానీయా కులగణన నివేదికను అందచేస్తారు.

నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి ఆమోంచిన పిదప ఈ నెల 5వ తేదీన ఉదయం జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం కుల గణన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ ప్రవేశపెట్టనుంది. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం కులగణన నివేదికను ప్రవేశ పెట్టనుంది. నివేదికపై ప్రత్యేక చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో కులగణన పై కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ గత ఏడాది అక్టోబరు 19న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కోసం ఉత్తర్వులు ఇచ్చింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన సర్వే చేయించి విజయవంతంగా పూర్తి చేసి నివేదికను సిద్ధం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పన దిశగా కుల గణన సర్వే నివేదిక ఆమోదంతో ముందడుగు పడనుంది. ఇప్పటికే బీసీ డెడికేటెట్ కమిషన్ కమిటీ సైతం రిజర్వేషన్ల అంశంపై కసరత్తు పూర్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ హామీల అమలు నేపథ్యంలో కుల గణనకు అసెంబ్లీ ఆమోదం ప్రభుత్వానికి కీలకంగా నిలువనుంది.

Next Story