- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులగణన: నో కాస్ట్ కింద 12 లక్షల మంది.. అందులో నార్త్ ఇండియన్స్ ఎక్కువ: ప్రొ.కంచ ఐలయ్య
తెలంగాణ కులగణనలో 12 లక్షల మంది 'నో కాస్ట్' కింద నమోదు చేసుకున్నారని, ఇందులో నార్త్ ఇండియన్స్ ఎక్కువున్నారని ప్రొ.కంచె ఐలయ్య అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేయించిన కులగణన సర్వేపై విద్యార్థులు, మేధావులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. కేవలం జనాభా లెక్కలను కాకుండా కులాల ఆర్థికంగా, సామాజికంగా పరిస్థితులను గమనించాలన్నారు. కులగణన రిపోర్టుపై ఇవాళ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో 12 లక్షల మంది నమోదు చేసుకున్నారని వీరు ఎవరో పరిశీలించాలన్నారు. ఇందులో తెలంగాణ సాధించుకున్నాక ఇక్కడికి వలస వచ్చిన నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారన్నారు.
తప్పుదోవ పట్టించారు:
అయితే తెలంగాణ ప్రభుత్వ కుల సర్వే (SEEEPC) విశ్లేషణ కోసం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ (IEWG) వైస్ చైర్మన్‌గా ప్రొ.కంచె ఐలయ్య పనిచేశారు. ఈ కమిటీపై స్పందిస్తూ తొమ్మిది మంది సభ్యుల కమిటీలో బీసీ ప్రతినిధిగా, వైస్ చైర్మన్‌గా ఉన్న నాపై ఎందరో విమర్శలు, బూతు వ్యాఖ్యలతో దాడి చేశారని ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయ కారణాలతో కొంతమంది ఈ సర్వేను అడ్డుకోవాలని చూశారని తమ అనుచరులను సర్వేలో పాల్గొనవద్దని, నో కాస్ట్ అని నమోదు చేయించుకోవాలని తప్పుదోవ పట్టించారన్నారు.






