- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు శోచనీయం: కూనంనేని
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీలో కేసులు పెట్టడాన్ని సీపీఐ నేత కూనంనేని ఖండించారు. వివరణ ఇచ్చినా కేసులు పెట్టడం సరికాదన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ (Professor Nageshwar) పై ఆంధ్రప్రదేశ్ లో కేసులు పెట్టడాన్ని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలను విశ్లేషిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్న ఆయనను ప్రజా మేధావిగా చూడాలి తప్ప రాజకీయాలతో ముడి పెట్టకూడదని పేర్కొన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను కొన్ని రాజకీయ పక్షాలు తప్పుగా అన్వయించుకున్నాయని కాబట్టి వాటిని ఉపసంహరించుకుంటున్నానని స్వయంగా నాగేశ్వర్ చెప్పినప్పటికీ ఆయనపై కేసులు పెట్టడం సమంజసం కాదని కూనంనేని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో నిష్పాక్షిక విశ్లేషకులు మేధావులు పౌర సమాజ ప్రతినిధుల అభిప్రాయాలను సమాజ సమతుల్యతను పరిరక్షించే కోణంలో చూడాలి తప్ప వారికి తప్పులను ఆపాదించడం సమంజసం కాదని అన్నారు. వ్యక్తుల వ్యాఖ్యల్లో నొప్పించే అంశాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో వివిధ వేదికల ద్వారా నేరుగా ప్రస్తావింపచేయాలి తప్ప కేసులు పెట్టి చట్టాలను బూచిగా చూపడం సమాజానికి మేలు చేయదన్నారు. తక్షణమే ఆయా రాజకీయ పార్టీలు ప్రొఫెసర్ నాగేశ్వర్ పై వారి కార్యకర్తలు పెట్టిన కేసులను ఉపసంహరించుకునేలా సూచించాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.






