- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ వీడియోలు వైరల్ చేసిన BRS ఐటీ సెల్.. గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు
బీఆర్ఎస్ ఐటీ సెల్(BRS IT Cell)పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station)లో కేసు నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఐటీ సెల్(BRS IT Cell)పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station)లో కేసు నమోదైంది. హెచ్‌సీయూలో ఆందోళనల వేళ నకిలీ వీడియోలు వైరల్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి దిలీప్(Dileep), క్రిశాంక్(Krishank)పై కేసు నమోదైంది. 353,1(C),353(2),192,196(1),61(1)(a) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హెచ్‌సీయూ(HCU) అధికారులను సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రజల్లో అశాంతి రేపేలా, రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్(Instagram), ఎక్స్(X)లో పోస్టులు వైరల్ చేశారని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. మరోవైపు.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం.. ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొదంటూ స్టే విధించింది. మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీన్ని చాలా సీరియస్ అంశంగా పరిగణించింది. తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.






