- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓవైసీపై అనుచిత వ్యాఖ్యలు.. తెలంగాణ బీజేపీ నేతపై కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఆగస్టు 15న కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేతపై కేసు నమోదైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఆగస్టు 15న కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేతపై కేసు నమోదైంది. బీజేవైఎం హైదరాబాద్ ఇన్‌ఛార్జి సాయి రామ్ యాదవ్ అలియాస్ లడ్డు యాదవ్‌పై అఫ్జల్ గంజ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 188, 504 కింద కేసు నమోదు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లడ్డూ యాదవ్ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్నారు. అదే సమయంలో అటువైపుగా అసదుద్దీన్ ఒవైసీ కారులో వెళ్తుండగా గుర్తించిన లడ్డూ యాదవ్ ఒవైసీని లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






