BRS ఎమ్మెల్యే పద్మారావు‌ గౌడ్‌పై కేసు నమోదు

by Satheesh |

ఎన్నికల కోడ్ ​ఉల్లంఘించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్​సీనియర్​నాయకుడు, సికింద్రాబాద్​నియోజకవర్గ అభ్యర్థి అయిన పద్మారావుతో పాటు మరో ఆరుగురికి

BRS ఎమ్మెల్యే పద్మారావు‌ గౌడ్‌పై కేసు నమోదు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికల కోడ్ ​ఉల్లంఘించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్​ సీనియర్​ నాయకుడు, సికింద్రాబాద్​ నియోజకవర్గ అభ్యర్థి అయిన పద్మారావుతో పాటు మరో ఆరుగురికి మార్కెట్​పోలీసులు సీఆర్పీసీ యాక్ట్​ సెక్షన్ ​41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్న హెచ్ఎండీఏ అకౌంట్స్​ ఆఫీసర్​ అబ్దుల్​ షఫీ ఆదివారం రాత్రి పెట్రోలింగ్​జరుపుతుండగా సికింద్రాబాద్​ ఆదయ్యనగర్‌లోని పద్మారావు నివాసం వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉన్నట్టుగా సమాచారం అందింది. ఈ క్రమంలో అబ్దుల్​షఫీ సిబ్బందితో కలిసి పద్మారావు ఇంటి వద్దకు వెళ్లారు. వీరిని చూడగానే పద్మారావు నివాసం వద్ద గుమిగూడి ఉన్న దాదాపు రెండు వందల మంది అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ మేరకు అబ్దుల్​షఫీ మార్కెట్​పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాము పద్మారావు ఇంటి వద్దకు వెళ్లినపుడు నూటా యాభై నుంచి రెండు వందల మంది గుమిగూడి ఉన్నారని, వీరిలో కొందరు గులాబీ కండువాలు ధరించి ఉన్నారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే వీళ్లంతా ఒక్క చోట చేరినట్టు తెలిపారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు సీఆర్పీసీ 161(3) ప్రకారం ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. అందుబాటులో ఉన్న వీడియోలను పరిశీలించారు. దీంట్లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టు స్పష్టమైన నేపథ్యంలో పద్మారావుతో పాటు టీ.కిరణ్​కుమార్​గౌడ్, టీ.కిశోర్​కుమార్​గౌడ్, భువనగిరి కిరణ్​గౌడ్, ఎం.దినేష్, బల్​దేవ్, ఎం.మైసయ్యలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. తాము పిలిచినపుడు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

Next Story