- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదు
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతో కాంగ్రెస్ నేత రవి కిరణ్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతో కాంగ్రెస్ నేత రవి కిరణ్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తలసానిపై కేసు నమోదవ్వగా ఇప్పటికే బేగంపేట మహంకాళి పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇదిలా ఉంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తప్పుల తడకగా మారిందన్నారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే రేవంత్ రెడ్డిని ముక్కలు చేస్తామంటూ మండిపడ్డారు. సికింద్రాబాద్ ను డీలిమిటేషన్ చేస్తే రైల్ రోకో, నిరసనలు చేస్తామని ప్రజారవాణాను అడ్డుకుంటామని హెచ్చరించారు. తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడగా తరవాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని చెప్పారు. ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు దొర్లుతాయని అన్నారు. సికింద్రాబాద్ ప్రాంతం తమ ఎమోషన్ అని ఇక్కడి ప్రాంతాలన్నీ మల్కాజ్ గిరిలో కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






