- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీర్జాగూడ బస్సు ప్రమాదంపై కేసు : సీపీ అవినాష్ మొహంతి
మీర్జాగూడ బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేశామని హైదరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తెలిపారు.

దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రయాణికులు బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీపీ అవినాష్ మొహంతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో 21 మంది మరణించగా.. వారిలో 14 మందిని గుర్తించామన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. బస్సులో ప్రయాణించిన అందరి వివరాలను తెలుసుకుంటున్నామని, ప్రమాదానికి దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నామని సీపీ అవినాష్ మొహంతి వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారిలో 18 మంది తాండూరు, చేవెళ్ల వాసులేనని తెలుస్తోంది. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ ను దస్తగిరి బాబా (38)గా, టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన ఆకాష్ గా గుర్తించారు.
READ MORE .....
ఈ సమయంలో రాజకీయాలొద్దు.. మీర్జాగూడ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం






