సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసు.. మాజీ సర్పంచ్ నందయ్యకు కేటీఆర్ భరోసా

by Ramesh Goud |

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ నందయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు.

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసు.. మాజీ సర్పంచ్ నందయ్యకు కేటీఆర్ భరోసా
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మాజీ సర్పంచ్ నందయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) భరోసా ఇచ్చారు. కరీంనగర్ లో జరిగిన సభ (Karimnagar Meeting) అనంతరం నందయ్య ఇంటికి వెళ్లిన కేటీఆర్.. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత కొద్ది రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా (siricilla District) బోయిన్‌పల్లి మండలం (Boinpally Mandal) వెంకట్రావుపల్లి గ్రామంలో (Venkatrav Pally) కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి కొంతమంది యువకులు జాయిన్ అయ్యారని మాజీ సర్పంచ్ బూర్గుల నందయ్య (Former Village President Boorgula Nandaiah) సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీంతో సోషల్ మీడియాలో (Social Media) తప్పుడు ప్రచారం చేస్తున్నారని నందయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పేషెంట్ అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈ సంఘటన గురించి తెలిసిన కేటీఆర్.. కరీంనగర్ సభ తర్వాత మార్గమధ్యంలో వెంకట్రావుపల్లి గ్రామంలో ఆగి, నందయ్య పరామర్శించారు. ఆయనపై నమోదైన కేసు గురించి సిరిసిల్ల ఎస్పీకి కాల్ చేసి, వెంటనే బోయిన్‌పల్లి ఎస్సై మీద చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దని కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చారు.

Next Story