సీఏలు కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకూడదు : కేటీఆర్

by Naga Rani Yarlagadda |

జీవితంలో కఠిన సవాళ్లను అధిగమిస్తేనే భవిష్యత్ బాగుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.

సీఏలు కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకూడదు : కేటీఆర్
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రస్తుతం మనకి ఎదురయ్యే కఠిన సవాళ్లను అధిగమిస్తేనే భవిష్యత్ లోని సవాళ్లను ఎదుర్కోగలమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నిర్వహించిన ఐసీఏఐ కాన్వకేషన్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఏ గ్రాడ్యుయేట్లకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. భవిష్యత్తులో వ్యాపార అవకాశాల్లో సీఏల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. ట్యాక్స్ లు, జీఎస్టీ, వ్యాపారాల విస్తరణల్లో సీఏల అవసరం చాలా ఉందన్నారు. సీఏలు కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకూడదని, వ్యాపారాలను బలోపేతం చేసేవారిగా కూడా ఉండాలని సూచించారు. దేశ అభివృద్ధిలో సీఏల పాత్ర ఎంతో కీలకమని గుర్తుచేశారు. పిల్లల ఎదుగుదల కోసం తమ తల్లిదండ్రులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువద్దని కేటీఆర్ కోరారు. అనంతరం సీఏ గ్రాడ్యుయేట్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ఎక్స్ లో షేర్ చేశారు.

Next Story