- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Car accident : కారు బోల్తా...అమ్మమ్మ, మనవరాలు దుర్మరణం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి(Bellampally)లో విషాదం చోటుచేసుకుంది. ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అర్ధరాత్రి బెల్లంపల్లి బైపాస్ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాని(Car accident )కి గురయ్యారు.

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి(Bellampally)లో విషాదం చోటుచేసుకుంది. ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అర్ధరాత్రి బెల్లంపల్లి బైపాస్ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాని(Car accident )కి గురయ్యారు.కారు బోల్తా పడగా అమ్మమ్మ(Grandmother) టింకరి కళ్యాణి(55), మనుమరాలు(Granddaughter) టింకరి ప్రియ మేఘన (8) ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి కన్నాలబస్తిలోని మధునన్న నగర్ కు చెందిన టింకరి కళ్యాణి, టింకరి రాజేష్, టింకరి అలేఖ్య, టింకరి ప్రియ మేఘన కుటుంబ సభ్యులు భూపాలపల్లికి శుభ కార్యానికి వెళ్లి శుక్రవారం రాత్రి బెల్లంపల్లికి బయలుదేరారు.
బైపాస్ జాతీయ రహదారిలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో టింకరి ప్రియ మేఘన అక్కడికక్కడే మృతిచెందగా టింకరి కళ్యాణి, టింకరి రాజేష్, టింకరి అలేఖ్య, తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని మంచిర్యాలలోనీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున కళ్యాణి మృతి చెందింది. మృతి చెందిన బాలిక టింకరి ప్రియ మేఘన తల్లి తండ్రులు రాజేష్, అలేఖ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.






