కంటోన్మెంట్ ప్రధాన రహదారులు ఓపెన్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 19 |
కంటోన్మెంట్ ప్రధాన రహదారులు ఓపెన్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఐదు ప్రధాన రహదారులను సామాన్య ప్రజల రాకపోకల వినియోగానికి అనుమతించడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని ఐదు రహదారులు రిచర్డ్‌సన్ రోడ్, ప్రోట్నీ రోడ్, బయామ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బయిన్ రోడ్ నుంచి సామాన్యులను అనుమతించడం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా మారుతుందని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సామాన్యులకు అనుమతించినందుకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ భద్రత, ప్రజలకు సౌలభ్యం అనే రెండు సున్నితమైన అంశాలని, వీటి విషయంలో అన్ని పక్షాలు కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఇటీవల రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన సందర్భంలో.. కంటోన్మెంట్ ప్రాంతానికి నీరు, విద్యుత్ సరఫరా నిలిపేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బెదిరింపులు, ఇతర అంశాలను కూడా తెలియజేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.



Next Story