- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఎన్జీ ఉన్న వారికి LPG గ్యాస్ కనెక్షన్ రద్దు.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం భారత్‍లో ఎల్‍పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతకు దారి తీసింది. గ్యాస్ సిలిండర్లకు భారీగా డిమాండ్ పెరగడంతో అక్రమార్కులు దీనిని బ్లాక్ మార్కెట్ దందాకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కలిగి ఉన్నవారకి డొమెస్టిక్ ఎల్‍పీజీ రద్దు చేసింది. పీఎన్జీ కలిగి ఉండి అదే సమయంలో డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) కనెక్షన్ ఉన్నవారు ఇకపై ఎల్‌పీజీ కనెక్షన్‌ను ఉంచుకోవడానికి వీల్లేదని ఈ మేరకు తాజాగా కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పైప్డ్ గ్యాస్ ఉన్న వారు వెంటనే తమ ఎల్‍పీజీ కనెక్షన్లు సరెండర్ చేయాలని ఆదేశించింది. పీఎన్డీ కనెక్షన్ ఉన్న ఇళ్లకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొత్తగా ఎల్‍పీజీ కనెక్షన్లు ఇవ్వడం కానీ సరఫరా చేయడం కానీ నిషేధించింది.
నిన్న ఒక్క రోజే 24 లక్షల సిలిండర్లు డెలివరీ:
యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ పెరిగాయాయి. ఈ క్రమంలో నిన్న (శనివారం) ఒక్కరొజే దేశవ్యాప్తంగా 24 లక్షల ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఇండియన్ గ్యాస్ 93,826, హెచ్‍పీ 79,974, భారత్ గ్యాస్ కు సంబంధించి 68,571 మొత్తం 2,42,371 సిలిండర్లు డెలివరీ చేయబడ్డాయని చమురు సంస్థలు వెల్లడించాయి.






