- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: శ్రీకాంత్ అయ్యంగార్ 'మా' సభ్యత్వం రద్దు చేయండి.. మంచు విష్ణుకు కాంగ్రెస్ ఫిర్యాదు
జాతిపిత మహాత్మగాంధీపై యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

దిశ, శేరిలింగంపల్లి/డైనమిక్ బ్యూరో: జాతిపిత మహాత్మగాంధీపై (Mahatma Gandhi remarks) యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) చేసిన వ్యాఖ్యలు సిని, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని నిన్న సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇవాళ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ తీరు తీవ్ర అభ్యంతరకరం అని ఆయన 'మా' సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. జాతిపిత గురించి అడ్డగోలుగా, తప్పుడు స్టేట్మెంట్‍లు చేసి ఇష్టారీతిగా మాట్లాడిన తీరు సరికాదన్నారు. సినీనటుడిగా సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సింది పోయి జాతిపిత గురించి ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. శ్రీకాంత్ అయ్యర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే శ్రీకాంత్ అయ్యర్ ను రోడ్లపై ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
సినీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదు?:
సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఖండించే టాలీవుడ్ పెద్దలు జాతిపితపై శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎందుకు స్పందించడం లేదని బల్మూర్ వెంకట్ ప్రశ్నించారు. సినిమా పెద్దలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు లాంటి వ్యక్తులు శ్రీకాంత్ అయ్యంగార్ మాటలను ఖండించి ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. ఆయన నటించే సినిమాలలో తాము నటించమని ప్రకటించాలని అప్పుడే సినీ పెద్దలు, సినిమా ఇండస్ట్రీపై అందరికీ గౌరవం పెరుగుతుందని అన్నారు.
శ్రీకాంత్ మాటలు తీవ్ర విచారకరం:
నటుడు, మా అసోసియేషన్ ప్రతినిధి శివ బాలాజీ మాట్లాడుతూ.. శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపట్ల తాము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. మా అసోసియేషన్‍కు సంబంధించి కమిటీ ఉందని, కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో రెండు రోజుల్లో కమిటీ మీటింగ్ ఉంటుందన్న శివబాలాజీ.. ఆ సమావేశంలో శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే మా అసోసియేషన్ అనేది కేవలం వెలిఫెర్ మాత్రమేనని, న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు. మా అసోసియేషన్ అనేది వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లదని స్పష్టం చేశారు.






