- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కాయ పేరు చెప్పగలరా? రేతోని మొదలు.. రేగ్గాయ కాదు! బండి సంజయ్ పొడుపు కథ?
by Ramesh Naini |
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తాజాగా ట్విట్టర్ వేదికగా పొడుకథ వేశారు. ఆ పొడుపు కథకు సమాధానం చెప్పాలన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తాజాగా ట్విట్టర్ వేదికగా పొడుకథ వేశారు. ఆ పొడుపు కథకు సమాధానం చెప్పాలన్నారు. ‘ఉత్తి మాటల కాయ ఉత్తుత్తి కాయ.. ఒక్క చెట్టున ఉండదు ఒగలాడి కాయ.. తుట్టి నింపుకుని తుర్రు మనెడి కాయ.. చెప్పు మాటలే గాని చేయలేని కాయ.. సైజు సిన్నదే గానీ గాయి చేసేడి కాయ.. రేతోని మొదలు గాని కాదు రేగ్గాయ’ అని పొడుపుకథ వేశారు. ఆ కాయ పేరు చెప్పగలరా? అంటూ నెటిజన్లను ఆ పొడుపుకథ సమాధానం చెప్పమన్నారు. దీంతో తీవ్ర స్థాయిలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ పొడుపు కథకు సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్‌లో ప్రచారంలో దూసుకపోతున్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచేందుకు కృషి చేస్తున్నారు.
Next Story






