- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లి GVJCలో క్యాంపస్ సెలక్షన్స్: 68 మంది విద్యార్థులకు ఉద్యోగాల
హైదరాబాద్ నాంపల్లిలోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 68 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నాంపల్లిలోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల (GVJC)లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఘనంగా ముగిసింది. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా శాఖ, ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ (MSN Laboratories) ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. 'సెల్ఫ్ డైరెక్టెడ్ టీమ్స్' ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించిన ఈ డ్రైవ్‌లో మొత్తం 68 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
వారిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (MLT) విభాగంలో 45 మంది, ఎంపీసీ/బైపీసీ (MPC/BiPC) విభాగం నుండి 13 మంది, ఫార్మా టెక్నాలజీ విభాగం నుండి 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా "లెర్న్ వైల్ యూ ఎర్న్" (Learn While You Earn) అనే ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తూ ఎంపికైన విద్యార్థులకు ఎంఎస్ఎన్ లాబొరేటరీస్‌లో ఉద్యోగంతో పాటు మరిన్ని ప్రయోజనాలు లభించనున్నాయి.
ముంబైలోని ప్రముఖ విద్యాసంస్థ టీఐఎస్ఎస్ (TISS) నుండి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఉచితంగా బీఎస్సీ (B.Sc) పట్టా పొందే అవకాశంతో పాటు, ప్రతి సంవత్సరం వేతన పెరుగుదల కూడా కల్పించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమం విద్యార్థులు తమ కెరీర్‌ను నిర్మించుకుంటూనే విద్యాపరంగా ఎదిగేందుకు గొప్ప వేదికగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. విద్యా రంగాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ విద్యార్థులకు ఉపాధి కల్పించడంలో ఈ రిక్రూట్‌మెంట్ ఒక ముఖ్యమైన అడుగు అని అధికారులు పేర్కొన్నారు.






