- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుది దశ పోరుకు సిద్ధం! మూడో విడత ఎన్నికల ప్రచారం బంద్
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత ప్రచారం ఇవాళ్టి సాయంత్రంతో గడువు ముగిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత ప్రచారం ఇవాళ్టి సాయంత్రంతో గడువు ముగిసింది. ప్రచార డప్పులు మోగడం ఆగిపోవడంతో, ఇప్పుడు అభ్యర్థులు, కార్యకర్తలు పోలింగ్ రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 17 (ఎల్లుండి) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 182 మండలాల్లోని 3 752 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి.
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 3,752 గ్రామ పంచాయతీలకు, 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ విడతలో 4,157 గ్రామాలకు, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 గ్రామాలు,7916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 3, 752 గ్రామ పంచాయతీల్లో 12,640 మంది సర్పంచ్ అభ్యర్థుల పోటీ పడుతున్నారు. కాగా, 11 గ్రామాలకు,112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు.
మద్యం దుకాణాలు బంద్..
ఎన్నికల నిబంధనల ప్రకారం, ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు బంద్ అమల్లోకి వచ్చింది. ఇక తుది విడత పోరుకు అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది సిద్దమయ్యారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ సామగ్రి చేరుకుంది. 16న ఉదయం 7 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్‌న్ సెంటర్ల వద్ద నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ షురూ అవుతుంది.






