RTC: దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ

by Prasad Jukanti |   (  Updated:2026-03-03 06:20:44  IST  )

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఆర్టీసీ స్పందించింది.

RTC: దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రానికి చెందిన మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఈ పథకం దివ్యాంగులకు సైతం అమలు చేయబోతున్నామని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని దివ్యాంగ పురుషులకూ వంద శాతం ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించిందని ఈ మేరకు వీరు రాష్ట్రంలోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ సరిహద్దుల లోపు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర (Inter-state) పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ సరిహద్దు వరకు ఉచితంగా ప్రయాణించేలా ఉత్తర్వులు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఆర్టీసీ క్లారిటీ:

జరుగుతున్న ప్రచారంపై ఆర్టీసీ స్పందించింది. దివ్యాంగులందరికీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తి అవాస్తవం అని స్పష్టం చేసింది. ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే పత్రికా ప్రకటన ద్వా అధికారిక టీజీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా వెల్లడిస్తామని ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.

Next Story