- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటితో ముగియనున్న ప్రచార గడువు.. సీఎం KCR షెడ్యూల్ ఇదే..!
by Sathputhe Rajesh |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగింపునకు చేరుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగింపునకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 106 స్థానాల్లో 5 గంటలకు ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 స్థానాలకు 4 గంటలకే ప్రచారం పర్వం ముగియనుంది. ఇక సీఎం కేసీఆర్ ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆశీర్వార సభలు నిర్వహించారు. కాగా ప్రచారానికి చివరి రోజు సీఎం కేసీఆర్ తాను పోటీ చేస్తున్న గజ్వేల్‌లో, వరంగల్ ఈస్ట్, వెస్ట్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. గజ్వేల్ ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున ప్రధాని మోడీ, అమిత్ షా బహిరంగ సభలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ సభ తర్వాత సీఎం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. గజ్వేల్ సభతో సీఎం తన ప్రచారాన్ని ముగించనున్నారు.
Next Story






