- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరికెపూడి గాంధీపై దాడి జరగబోతుందంటూ ప్రచారం..!
తెలంగాణ రాష్ట్రానికి (Telangana State) చెందిన ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీకి ( MLA Arekapudi Gandhi) ఊహించని పరిణామం చోటు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి (Telangana State) చెందిన ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీకి ( MLA Arekapudi Gandhi) ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీపై దాడి జరగబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. సాయంత్రం 5 గంటల తర్వాత నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేస్తారని వాట్సప్‌లో ( Whats UP) మెసేజ్ ( SMS) పెట్టాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ గోశాలకు వెళ్లే సమయంలో దాడికి ప్లాన్ చేశారని అజ్ఞాత వ్యక్తి వాట్సప్‌లో మెసేజ్ పెట్టాడు.
దాడికి ప్లాన్ చేసిన వారిపై గతంలో అక్రమ ఆయుధాల కేసులు ఉన్నాయని అజ్ఞాత వ్యక్తి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్ ( Arvind Kumar), సాయి రితీష్ రెడ్డి, కోలా వంశీ, గుళ్ల నాగరాజులు దాడి చేస్తారంటూ వారి ఫోన్ నంబర్లు కూడా పెట్టాడు ఆగంతకుడు. అయితే దీనిపై అరవింద్ కుమార్ వెంటనే స్పందించారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు అరవింద్ కుమార్. అజ్ఞాత వ్యక్తి ఆరోపణలు నిజం కాదని అంటున్నారు అరవింద్ కుమార్.
ఇది ఇలా ఉండగా... గులాబీ పార్టీ నుంచి గెలిచిన అరికెపూడి గాంధీ.. పార్టీ మారిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారిన వెంటనే... స్పీకర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా కోర్టును ఆశ్రయించింది గులాబీ పార్టీ. ఇలా 10 మంది ఎమ్మెల్యేలపై పోరాటం చేస్తుంది గులాబీ పార్టీ. ప్రస్తుతం వీళ్ళ కేసు కోర్టు పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే దాడికి ప్రయత్నించిన వారు గులాబీ పార్టీకి చెందినవారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా ఆదే చెబుతున్నారు.






