- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: చైర్మన్‌గా భట్టి విక్రమార్క.. సభ్యులుగా నలుగురు మంత్రులు
ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల పేరుతో తీసుకువస్తున్న బిల్లుపై అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల పేరుతో తీసుకువస్తున్న బిల్లుపై అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చైర్మన్‌గా నియమించగా.. సభ్యులుగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ విద్యాసంస్థల్లో జరుగుతున్న వివక్షపై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలులో ఉన్న చట్టాలను పరిశీలించి, తెలంగాణకు అనుకూలంగా సమగ్ర చట్టం రూపొందించేందుకు సూచనలు ఇవ్వనుంది. అలాగే.. విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ, పర్యవేక్షణ యంత్రాంగం, కఠిన చర్యల విధానం వంటి అంశాలపై సిఫారసులు చేయాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక ఆధారంగా బిల్లును తుది రూపంలో సిద్ధం చేసి, శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశమున్నది. ఈ బిల్లు అమల్లోకి వస్తే, విద్యార్థుల హక్కులకు మరింత బలమైన రక్షణ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.






