Bhatti Vikramarka: పెండింగ్ పనులపై ఫోకస్.. డిప్యూటీ సీఎం అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ

by Ramesh Naini |

Bhatti Vikramarka: పెండింగ్ పనులపై ఫోకస్.. డిప్యూటీ సీఎం అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ సచివాలయంలో ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ (Cabinet sub committee) భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అధ్యక్షతన సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, పలువురు ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్ వర్క్స్, టెండర్స్, నిధులు మంజూరు అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. వీటిపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక సమర్పించనున్నట్లు అధికార వర్గాల సమాచారం అందుతోంది. సామర్థ్యాన్ని బట్టి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రజాప్రయోజనాల ప్రాజెక్టుల వర్గీకరణ, ప్రాధాన్యత ఆధారంగా రాబోయే 24 నెలల పాటు మౌలిక సదుపాయాలు, వనరుల కేటాయింపులు, మంజూరు చేసిన పనులకు ప్రాధాన్యత ఆధారంగా టెండర్లు పిలవడం వంటి అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story