Cabinet Meeting: ముగిసిన కేబినెట్ సమావేశం.. కాసేపట్లో సభ ముందుకు ఆ రెండు నివేదికలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-04 08:50:41  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ హాలు (Assembly Hall)లో జరిగిన కేబినెట్ భేటీ (Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది.

Cabinet Meeting: ముగిసిన కేబినెట్ సమావేశం.. కాసేపట్లో సభ ముందుకు ఆ రెండు నివేదికలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ హాలు (Assembly Hall)లో జరిగిన కేబినెట్ భేటీ (Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా కుల గణన (Cast Census), ఎస్సీ వర్గీకరణ (Classification Of SC) నివేదికపై సుధీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆ రెండు నివేదికలపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు. అదేవిధంగా అన్ని పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

కాగా, ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ (Justice Shamim Akhtar) ఏకసభ్య కమిషన్ నివేదికను ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘానికి అందజేసింది. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో ఆ రెండు నివేదికలు చర్చకు రానున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (Classification of SC)పై ఏర్పాటైన ఏక సభ్య కమిషన్ ఎస్సీ ఉప కులాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను రూపొందించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Next Story