- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే చాన్స్!
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయం (Secretariat)లో మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయం (Secretariat)లో మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణా రావు పాల్గొననున్నారు. సమావేశంలో భాగంగా రాష్ట్రంలో కొనసాగుతోన్న అభివృద్ధి పనుల పురోగతి ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలు సహా మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ (BC Reservations)పై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. మరో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నాహాలపై సమీక్షించనున్నారు. ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలను మొదట నిర్వహించి.. ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు జరిపే అవకాశం ఉందని ప్రాథమికంగా తెలుస్తోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రజల్లోకి ఎలా విస్తృతంగా తీసుకెళ్లాలనే అంశాలు కూడా నేటి మంత్రివర్గ భేటీలో చర్చకు రాబోతున్నాయి.






