- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Cabinet meeting: నేడే కేబినెట్ భేటీ.. స్కిల్స్ యూనివర్శిటీ బిల్లుపై డిస్కషన్!
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని స్థాపించడానికి మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలపనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగురోడ్డు వరకూ విస్తరింపజేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. దీనిపైనా కేబినెట్ చర్చించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. వీటికి తోడు కొత్త రేషనుకార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వం స్వీట్ న్యూస్ చెప్పాలనుకుంటోంది. ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నదో, దానికి అనుసరించాల్సిన విధివిధానాలేంటో చర్చించనుంది. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇటీవలే అసెంబ్లీలో చర్చల సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున అసెంబ్లీ కమిటీ హాల్‌లోనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేలా షెడ్యూలు రూపొందింది. తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకున్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వేదికను అక్కడికే మార్చుకున్నది ప్రభుత్వం. అన్ని అంశాలకు తోడు హైదరాబాద్ అభివృద్ధికి విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలను సమకూర్చుకునే అంశంపైనా మంత్రుల అభిప్రాయాలను ఈ సమావేశం ద్వారా తీసుకోవాలనుకుంటుంది. సిటీ డెవలప్‌మెంట్ కోసం ప్రపంచబ్యాంకు లాంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి రుణం రూపంలో ఆర్థిక సాయాన్ని పొందాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశముంది.