TG: కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-04 14:57:11  IST  )

కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)ను తెలంగాణ మంత్రి మండలి ఆమోందించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని.. త్వరలోనే దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు అందరికీ కమిషన్ నివేదిక ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు అని అన్నారు. ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదని.. నిపుణుల కమిటీ ఇచ్చిందని తెలిపారు. దీనిపై ఎవరు ఏ రకంగా మాట్లాడుతారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు.

READ MORE ......

MLC కవిత ఘోష్ కమిటీకి నివేదిక ఇచ్చుంటే బాగుండేది.. CM రేవంత్ సెటైర్


Next Story