జీహెచ్‌ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం.. 27 మున్సిపాలిటీలు విలీనం

by Gantepaka Srikanth |

జీహెచ్‌ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం

జీహెచ్‌ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం.. 27 మున్సిపాలిటీలు విలీనం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి(Telangana Cabinet) సమావేశం ముగిసింది. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, శంషాబాద్‌లు, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయి గూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌‌పేట్, బండ్లగూడ జీగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కాబోతున్నాయి.

Next Story