కాళ్ళు మొక్కితేనే వ‌దిలేస్తాం...చుక్క‌లు చూపించిన క్యాబ్ డ్రైవ‌ర్లు

by velandi.Saikiran |   (  Updated:2025-09-17 02:05:21  IST  )

ఓ తాగుబోతుకు చుక్క‌లు చూపించారు క్యాబ్ డ్రైవ‌ర్లు. డ్రైవింగ్ చేస్తుండ‌గా..ప‌చ్చిబూతులు తిట్టాడ‌ని ఓ ప్ర‌యాణికుడిని ఆట

కాళ్ళు మొక్కితేనే వ‌దిలేస్తాం...చుక్క‌లు చూపించిన క్యాబ్ డ్రైవ‌ర్లు
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఓ తాగుబోతుకు చుక్క‌లు చూపించారు క్యాబ్ డ్రైవ‌ర్లు. డ్రైవింగ్ చేస్తుండ‌గా..ప‌చ్చిబూతులు తిట్టాడ‌ని ఓ ప్ర‌యాణికుడిని ఆట ఆడుకున్నారు క్యాబ్ డ్రైవ‌ర్లు. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటు చేసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. త‌న భార్యతో క‌లిసి.. ఆ తాగుబోతు కారు బుక్ చేసుకున్నాడు. ఇక కారు వెళుతున్న త‌రుణంలోనే... డ్రైవ‌ర్ ను బండ‌బూతులు తిట్టాడ‌ట స‌ద‌రు ప్ర‌యాణికుడు. త‌న ఇంట్లో వాళ్ల‌ను కూడా తిట్ట‌డంతో... క్యాబ్ డ్రైవ‌ర్ కు కోపం వ‌చ్చింది.

దీంతో అత‌ని బూతులు రికార్డు చేసి.... తోటి డ్రైవ‌ర్ల‌కు స‌మాచారం అందించాడు. అనంత‌రం ప‌క్క‌కు కారు ఆపేసి....డ్రైవ‌ర్లు అంద‌రూ ఏకం అయ్యారు. డ్రైవ‌ర్ ను తిట్టినందుకు కాళ్లు మొక్కి స్వారీ చెప్పాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పినా... కాళ్లు మొక్కాల్సిందేన‌ని ఆ తాగుబోతుకు చుక్క‌లు చూపించారు. దీంతో చివ‌ర‌కు డ్రైవ‌ర్ కాళ్లు మొక్కాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఈ సంఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. ఇలా చేయ‌కుండా... పోలీసులకు ఆ తాగుబోతును అప్ప‌గిస్తే బాగుండ‌ని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్

Next Story