- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుది దశకు బైపోల్ అభ్యర్థి ఎంపిక.. ఢిల్లీకి చేరుకున్న బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దిశకు చేరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దిశకు చేరింది. అభ్యర్ధిని ఖరారు చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ జాతీయ నేతలైన బీఎల్‌సంతోష్, సున్సీల్భన్సల్తో సమావేశమైన ఇటీవల ఆయనకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక అందజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పార్లమెంటరీ బోర్డు చర్చించిన అనంతరం అభ్యర్ధి ప్రకటన ఉంటుందని తెలిసింది. కమిటీ ఇచ్చిన నివేదికలో దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్లు పార్టీలో టాక్వినిపిస్తోంది. వీరు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్పార్టీలను గెలిపిస్తే దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి ఉండదని విమర్శలు చేస్తున్నారు. 11 ఏళ్ల మోడీ పాలనలో దేశంలో అభివృద్దిలో దూసుకపోతుందని, తెలంగాణ కూడా పార్టీని ప్రజలు ఆదరించాలని కోరుతున్నారు. హైకమాండ్రాష్ట్ర నాయకులు పంపించిన జాబితాలోని ముగ్గురి రాజకీయ నేపథ్యం, ప్రజల్లో పలుకుబడి, పార్టీకి అందించిన సేవలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయనున్నట్లు సీనియర్లు తెలిపారు.






