- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: జూబ్లీహిల్స్ తో పాటే ఆ 10 స్థానాలకు ఉప ఎన్నికలు?.. తెలంగాణ స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం ఇంట్రెస్టింగ్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ స్థానంతో పాటు మరో పది చోట్ల బై ఎలక్షన్స్ అనివార్యం కాబోతున్నాయా? పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఇవే సందేహాలు హాట్ టాపిక్ గా మారాయి. అనర్హత పటిషన్లపై 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలని 'ఆపరేషన్ సక్సెస్.. పేషెండ్ డైడ్' అన్న చందంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొనడం సంచలనంగా మారుతోంది. దీంతో ఎమ్మెల్యేల అనర్హత ఫిర్యాదులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నది.
స్పీకర్ డెసిషన్ ఏంటి?:
బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, కాలె యాదయ్యా, ప్రకాశ్ గౌడ్, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. వీళ్ల పార్టీ ఫిరాయింపుపై ఫిర్యాదు చేసినా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై 3 నెలల్లోగా తేల్చాలని స్పీకర్ కు సర్వోన్నన్నత న్యాయస్థానం సూచించింది. ఎక్కువ కాలం పెండింగ్ పెట్టవద్దని, నిర్ణయంలో ఆలస్యాన్ని నివారించేందుకు కాలపరిమితి చెప్తున్నామంటూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో స్పీకర్ కు ఇక నిర్ణయం తీసుకోవడం తప్ప మరో మార్గం లేదా? అనేది ఆసక్తిగా మారింది. అయితే ఓ వైపు స్పీకర్ కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధిస్తే మరోపైపు స్పీకర్ ముందు దాఖలైన పిటిషన్‌ల పరిష్కారానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. 2022లో మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ థాక్రే), శివసేన (ఏక్ నాథ్ షిండే) వర్గాల మధ్య ఇలాంటి కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ఈ పిటిషన్ లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా మహారాష్ట్ర స్పీకర్ మాత్రం ఆ తీర్పును అమలు చేయలేదు. దీంతో తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందా లేక నిర్ణయం అనివార్యం కాబోతున్నదా అనేది మరో మూడు నెలల్లో తేలనుంది. సుప్రీంకోర్టు తుది తీర్పు తీసుకోవడంతో స్పీకర్ వైఖరిని బట్టే తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆలోచన ఏమిటి? ప్రభుత్వం వ్యూహం ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.
జూబ్లీహిల్స్ తో పాటు పది స్థానాల్లో బై ఎలక్షన్స్?:
కోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన (Anti-defection) ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఈ పది స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం అనే చర్చ రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వీరిపై వేటు పడితే జూబ్లీహిల్స్ బై పోల్ తో పాటే ఈ పది స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు తీర్పు తర్వాత స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. త్వరలోనే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు మాకు మూడు నెలల సమయం ఉంది ఇక పనిలోకి వెళదాం అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోర్టు తీర్పుపై స్పందించిన తెలంగాణ బీజేపీ నేతలు స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామి చెబుతోంది.
ఒక వేళ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో ఉప ఎన్నికలే అనివార్యం అయి జూబ్లీహిల్స్ తో పాటే ఈ పది స్థానాలకు ఉప ఎన్నిక కన్ఫర్మ్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేస్తాయని అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మా వ్యూహం మాకు ఉందని చెబుతున్న అధికార పార్టీ ఈ విషయంలో ప్రతిపక్షాలకు ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నది అనేది వేచి చూడాలి.






