- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మునుగోడు ప్రచారానికి రాలేమంటోన్న టీఆర్ఎస్ నేతలు
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ బాస్ ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు.

దిశ, జగిత్యాల టౌన్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ బాస్ ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే గ్రామస్థాయి నుండి టీఆర్ఎస్ నేతలను ప్రచారానికి ఇన్‌చార్జీలుగా నియమించారు. అయితే, జగిత్యాల జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు కేసీఆర్ ఆదేశించినప్పటికీ మునుగోడు వెళ్లకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
పొలం పనుల సాకుతో...
టీఆర్ఎస్ గ్రామస్థాయి నాయకుల్లో ఎక్కువమంది వ్యవసాయ పనులపై ఆధారపడిన వారు ఉన్నారు. వరి నాట్లు కోతకు రావడంతో వ్యవసాయ పనులకు దూరంగా ఉండలేక, మరోవైపు మునుగోడు ప్రచారానికి రాలేము అని నాయకులకు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : లిక్కర్ స్కామ్‌లో హాట్‌టాపిక్‌గా సికింద్రాబాద్.. కథ అంతా నడిచేది ఆ కాంప్లెక్స్‌లోనే!






