- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో డిపోలకే పరిమితమైన బస్సులు.. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన
కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె మరింత ఉధృత రూపం దాల్చింది. కార్మికులు తమ పంతం వీడకపోవడంతో అర్ధరాత్రి నుంచే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతలు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అయితే, ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోగా.. 4 వారాల టైమ్ పెట్టడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. దీంతో కార్మికులు డిపోల ఎదుట బైఠాయించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని సంఘాలు తప్పుదొవ పట్టిస్తున్నాయి..
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి (Nagi Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డిమాండ్లను పరిశీలించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. కొన్ని కార్మిక సంఘాలు నిజాలను విస్మరించి, రాజకీయ లబ్ధి కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్ట్యా కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, మరోవైపు ఎండీ ప్రకటన చేసినప్పటికీ, కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ‘మాటలు వద్దు.. చేతలే ముద్దు’ అంటూ డిపోల గేట్ల వద్ద నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ డ్రైవర్లతో బస్సులు నడిపే ప్రయత్నం చేస్తుండటంతో, వారిని అడ్డుకునేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారు. ఇది పోలీసులకు, కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది.






