- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మండిపోతున్న ఎండలు.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 41 నుంచి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 41 నుంచి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ప్రజలు రాబోయే నాలుగు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మే 19 నుంచి 24 వరకు ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
అధికారుల సూచనలు..
తీవ్రమైన వడగాల్పుల దృష్ట్యా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని, కాబట్టి ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ గట్టిగా విజ్ఞప్తి చేసింది.






