- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం ప్రియులకు బంపరాఫర్.. ఆబ్కారీ శాఖ రియాక్షన్ ఇదే!
తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ఆబ్కారీ శాఖ లిక్కర్ సేల్స్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ఆబ్కారీ శాఖ లిక్కర్ సేల్స్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మార్పీ రేట్ కంటే తక్కవ ధరకు మద్యం విక్రయించొద్దని తాజాగా ఆబ్కారీ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీ గడువు ముంచుకొస్తుండటంతో మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ దృష్టిసారించింది. ఎమ్మార్పీ ధర కంటే తక్కవకు విక్రయించొద్దని.. అలా చేస్తే జరిమానా, జైలు శిక్ష తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఈనెల 30న తెలంగాణ ఎన్నికలు ఉండగా 28, 29, 30 తేదీల్లో విక్రయాలు నిలిపేయాల్సి ఉంటుంది. ఇక, ప్రస్తుత మద్యం విధానం గడువు ఈ నెల 30తో ముగియనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ దారులు విక్రయాలు ప్రారంభిస్తారు.
దీంతో ఆ గడువులోగా మద్యం షాప్‌ల్లో ఉన్న స్టాక్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే మూడు రోజులు తెలంగాణలో ఎన్నికల దృష్ట్యా వైన్స్ షాపులు బంద్ ఉండనున్నాయి. 30 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉన్న మద్యాన్ని విక్రయించాలి. తక్కువ సమయంలో ఎక్కువ లిక్కర్‌ను సేల్ చేసేందుకు తక్కువ రేట్‌కు ఎవరైనా మద్యం అమ్మే విషయమై అధికారులు నిఘా ఉంచారు. ఎవరైనా తక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తే రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు జరిమానా విధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక వేళ నేరం రుజువైతే 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.






