- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు దుర్మరణం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోలీచౌకీలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఇటీవలే హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం సమయంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులతోపాటు వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. ఇది జరిగిన కొన్నాళ్లకే ఇవాళ భవనం కూలడం, మళ్లీ నలుగురు మృతిచెందడం కలకలం రేపుతోంది. వరుస ప్రమాదాలు హైదరాబాద్ నగర వాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.






