- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : కాంగ్రెస్ పాలనలో కష్టనష్టాల్లో బిల్డర్లు : హరీష్ రావు
కాంగ్రెస్ 13నెలల పాలన(Congress Government)లో రియల్ ఎస్టేట్ రంగం(Real Estate Sector)పడిపోయి(Falling) అపార్ట్మెంట్లు అమ్ముడుపోక..బ్యాంకర్లు లోన్లు ఇవ్వక బిల్డర్లు కష్టనష్టాల పాలై ఆత్మహత్యల(Builders Commit Suicide)కు పాల్పడుతున్నారని బీఆర్ఎస్(BRS) మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ 13నెలల పాలన(Congress Government)లో రియల్ ఎస్టేట్ రంగం(Real Estate Sector)పడిపోయి(Falling) అపార్ట్మెంట్లు అమ్ముడుపోక..బ్యాంకర్లు లోన్లు ఇవ్వక బిల్డర్లు కష్టనష్టాల పాలై ఆత్మహత్యల(Builders Commit Suicide)కు పాల్పడుతున్నారని బీఆర్ఎస్(BRS) మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను హరీష్ రావు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రియల్ఎస్టేట్ టో ఎదురైన నష్టాలతోనే వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని వారు కన్నీళ్లతో వెల్లడించారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఓ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యయేనని ఆరోపించారు. మృతుడి భార్య కథనం మేరకు ఏ బ్యాంకుకు వెళ్లి లోన్ కోసం ప్రయత్నించినా బ్యాంకర్లు నీవు బిల్డర్ నీకు లోను ఇవ్వమని చెప్పారని..దీంతో భార్య పేరు మీద లోను కోసం ట్రై చేసినప్పటికి కో అప్లికెంట్ గా భర్త బిల్డర్ కావడంతో లోను ఇవ్వమని బ్యాంకర్లు చెప్పారని హరీష్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 13నెలల పాలనలో కట్టిన అపార్ట్మెంట్ అమ్ముడుపోక..ఎక్కడా అప్పు పుట్టక ఆర్థిక ఇబ్బందులతో వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఒకప్పుడు బిల్డర్ అంటే లోన్లు ఇస్తామని బ్యాంకులు వెంటపడేవని..సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యామా అని ఇప్పుడు బిల్డర్ అంటేయువ బిల్డర్ వేణుగోపాల్ రెడ్డికి 5సంవత్సరాల కూతురు ఉందన్నారు. ఇప్పటికైనా మరింత మంది బిల్డర్లు చనిపోకుండా ప్రభుత్వం చర్చలు తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల, చేనేతలు, ఆటో కార్మికులు, బిల్డర్ల ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కొనసాగుతోందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో వృద్ధి చెందిందన్నారు. ఏమన్నా అంటే నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా అని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బేషజాలకు పోకుండా హైడ్రా వంటి సంస్థలను ఎత్తివేయాలన్నారు. వేణుగోపాల్ రెడ్డి భార్య కూడా అపార్ట్మెంట్లు అమ్ముడుపోకపోవడానికి హైడ్రా కూడా కారణమని చెప్పారన్నారు. వాస్తవానికి వేణుగోపాల్ రెడ్డి కట్టిన నిర్మాణాలు హైడ్రా పరిధిలో లేకపోయిన హైడ్రా భయంతో పడిపోయిన రియల్ ఎస్టేట్ రంగంతో అపార్ట్మెంట్లు విక్రయం జరగలేదన్నారు. హైడ్రా, మూసీ పరిధిలో కూల్చివేతల నేపథ్యంలో నెలకొన్న ప్రతికూల ప్రచారంతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని..బిల్డర్లు నష్టపోయి వలస పోతున్నారన్నారు.
బీఆర్ఎస్ హయంలో రాష్ట్రానికి వచ్చిన నిర్మాణ రంగం వ్యాపారులు ఇప్పుడు రాకుండా పోతున్నారన్నారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యపై బిల్డర్ అసోసియేషన్ స్పందించాల్సిన అవసరముందని..రేవంత్ రెడ్డి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మగౌరవం కోసం చనిపోవడానికి ముందు తన ఎల్ఐసీ పాలసీ కూడా రద్దు చేసుకుని అప్పులు తీర్చాడని గుర్తు చేశారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో రేవంత్ రెడ్డి సమీక్షించుకుకోవాలన్నారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. శాసన సభలో రియల్ ఎస్టేట్ రంగం, బిల్డర్ల సమస్యలపైన లేవనెత్తుతామని..బాధితుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజలు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకోవద్ధని.. జనతా గ్యారేజీగా పిలువబడే బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి తమ కష్టాలు చెబితే మా పార్టీ అవసరమైన సహాయం అందిస్తుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు. బ్యాంకులు లోన్లు ఇవ్వమంటూ మొహం చాటేస్తున్నాయని హరీష్ రావు విమర్శించారు. వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని చూస్తే బాధకల్గుతుందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.






