గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కండి.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-12 08:18:02  IST  )

గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా రానున్న పుష్కరాల నేపథ్యంలో శాశ్వత ఘాట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కండి.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో శాశ్వత ఘాట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇవాళ బంజారా‌ హిల్స్‌ (Banjara Hills)లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (Integrated Command Control Center)లో గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha)తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై కీలక సూచనలుచ చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవాలన్నారు.

బాసర (Basara) నుంచి భద్రాచలం (Bhadrachalam) వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆలయాలను క్షేత్ర స్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించి పూర్తి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా ఆలయాల పరిధిలో ప్రస్తుతం ఉన్న ఘాట్లను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్ల వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరుగా ఘాట్స్ డిజైన్లు రూపొందించాలని, ఈ అంశంలో పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story