- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీటెక్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ గడువు పెంపు
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ మొదటి సంవత్సరం మేనేజ్ మెంట్ కోటా (బీ-కేటగిరీ) సీట్ల అడ్మిషన్ల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ప్రకటించింది.

- ఈ నెల 18 నుంచి 25 వరకు పెంపు
- వర్షాల నేపథ్యంలో గడువు పెంపు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ మొదటి సంవత్సరం మేనేజ్ మెంట్ కోటా (బీ-కేటగిరీ) సీట్ల అడ్మిషన్ల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండలి తెలిపింది. ఈ నెల 18 వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించి అడ్మిషన్ల గడువు ఉండగా, ప్రస్తుతం ఈ గడువును ఆగస్టు 25 వరకు పొడిగించారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీకేటగిరీ కింద ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ఈ నెల 30లోగా కౌన్సిల్‌కు సమర్పించాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు, కళాశాలలకు కొంత ఊరట లభించినట్టయింది. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ కాలేజీల యాజామాన్యాలు సైతం తమ కాలేజీల్లో అడ్మిషన్ల కొరత ఉందని, గడవును పొడిగించాలని కోరినట్లు సమాచారం.






