Breaking News : ఆ సీట్లు ఇక తెలంగాణ వారికే

by Muthe.Rajitha |

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రొఫెషనల్ కోర్స్​లలో అడ్మిషన్ గైడ్ లైన్స్ మార్పు చేస్తూ తెలంగాణ స్థానికులకే వృత్తి విద్య మెజారిటీ సీట్లు రిజర్వ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Breaking News : ఆ సీట్లు ఇక తెలంగాణ వారికే
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రొఫెషనల్ కోర్స్​లలో అడ్మిషన్ గైడ్ లైన్స్ మార్పు చేస్తూ తెలంగాణ స్థానికులకే వృత్తి విద్య మెజారిటీ సీట్లు రిజర్వ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా జారీ చేసిన జీఓ ఎంస్ 15 ప్రకారం, ఓయూ పరిధిలోని (తెలంగాణలోని మొత్తం ప్రాంతం) స్థానిక అభ్యర్థులకు రాష్ట్రంలోని విద్యా సంస్థలు అందించే ఒక్కో కోర్సులో 85 శాతం సీట్లు రిజర్వు చేయాలని నిర్ణయించారు. మిగిలిన 15 శాతం సీట్లు అన్‌రిజర్వ్‌డ్‌ కిందకు వస్తాయి. అయితే, తెలంగాణ ప్రాంతంలోని స్థానికులుగా ప్రకటించిన అభ్యర్థులు అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ సీట్లకు అర్హులవుతారని తెలిపింది.

రాబోయే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ఇంజనీరింగ్ తో సహా వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ఇకపై కోటా ఉండబోదని స్పష్టం చేసింది. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న స్థానికతను నిర్ణయించేందుకు 10 ఏళ్లు తెలంగాణలో చదివి ఉండటంతో పాటు వారి తల్లిదండ్రలు తెలంగాణలో నివసించి ఉండాలనే నిబంధన విధించారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తోన్న వారి పిల్లలు, ఉద్యోగుల జీవిత భాగస్వాములు 15శాతం సీట్లకు అర్హులని వెల్లడించింది. 15 శాతం సీట్లకు 4 రకాలవారు అర్హులుగా గుర్తిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థలు గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థలు అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నిర్దేశించిన 10 సంవత్సరాల కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రవేశాలు ఈ విద్యా సంవత్సరం ముగియడంతో ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను రూపొందించింది. ఇప్పటి వరకు, రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో 85 శాతం సీట్లు తెలంగాణ స్థానికులకు రిజర్వ్ చేశారు. మిగిలిన 15 శాతంలో మిగతా ప్రాంతాల వారికి కేటాయించారు.

Next Story