ఈ గూండాల పీడను వదిలించుకోవాలి: RSP (వీడియో)

by Disha Web Desk 2 |
ఈ గూండాల పీడను వదిలించుకోవాలి: RSP (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై బీఎస్‌పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్పీ షేర్ చేశారు. ‘‘ఈ వీడియోను చివరిదాకా చూస్తే మీకర్థమైతది. బీఆర్ఎస్ నేతల గూండాగిరి తెలంగాణలో ఏ స్థాయి కి చేరిందో. మనం ఈ పీడను విదిలించుకోకపోతే, ఈ లాంటి ముష్కరులు ప్రతి ఊరిలో మన ధన మాన ప్రాణాలను దోచుకుంటరు, జాగ్రత్త! ఈ గూండాలందరికీ అభయమిస్తున్న బిగ్ బాస్ @బాపు ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది.’’ అని రాష్ట్ర ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.



Next Story

Most Viewed