కేసీఆర్ సార్.. దయచేసి మోసాలు ఆపండి: RSP

by GSrikanth |

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవనడం పచ్చి అబద్ధం అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు.

కేసీఆర్ సార్.. దయచేసి మోసాలు ఆపండి: RSP
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవనడం పచ్చి అబద్ధం అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు. 2014 నుండి 2022 వరకు 6912 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలు రైతు స్వరాజ్య వేదిక దగ్గర ఉన్నవని, ఈ ఏడాదిలో కూడా మొదటి 57 రోజుల్లోనే 52 రైతు ఆత్మహత్యలు జరిగాయని ఆర్ఎస్పీ ఆరోపించారు. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా 12 రైతు ఆత్మహత్యలు జరిగినయన్నారు. కేసీఆర్ ఇకనైనా రైతులను మోసం చేయడం ఆపాలంటూ ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.

Next Story