- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో దారుణం.. ఆస్తి కోసం వారం వ్యవధిలో ఆరుగురి దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ దుర్మార్గుడు సొంత కుటుంబ సభ్యులనే కిరాతకంగా హత్య చేశారు.

దిశ, వెబ్‌డెస్క్/ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ దుర్మార్గుడు స్నేహితుడి కుటుంబ సభ్యులనే కిరాతకంగా హత్య చేశాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురిని ఈ నెల 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో విడివిడిగా చంపేశాడు. ప్రశాంత్ అనే నిందితుడు మొదట ప్రసాద్ అనే వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా డిచ్‌పల్లి వద్ద హైవే పక్కన పూడ్చిపెట్టాడు.
తర్వాత మక్లూర్‌లోని మృతుడి ఇంటికి వెళ్లి అతని భార్యను తీసుకెళ్లి బాసర వద్దనున్న గోదావరిలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ను, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారని అతని ఇద్దరి చెల్లెళ్లను నమ్మించాడు. ఇద్దరినీ సదాశివనగర్‌కు తీసుకెళ్లి కాల్చి చంపాడు. ఆ తర్వాత చివరకు ప్రసాద్ ఇద్దరు పిల్లలను కూడా వదలకుండా పోచంపహాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలో పడేసి దారుణంగా చంపేశాడు. ఈ హత్యలు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. నిందితులు ప్రశాంత్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






