- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ నల్లగొండలో దారుణ హత్య
ఎన్నికల వేళ నల్లగొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడ్ని కిరాతకంగా కత్తులతో నరికి హత్య చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ నల్లగొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడ్ని కిరాతకంగా కత్తులతో నరికి హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతుడు అదే గ్రామానికి చెందిన పోలెబోయిన మల్లేశ్‌గా గుర్తించారు. అర్ధరాత్రి ఇంట్లో చొరబడి మరీ హత్య చేసినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మల్లేశ్ మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికల వేళ యువకుడి హత్య జరుగడం స్థానకంగా తీవ్ర కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






