- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఓ 282 రద్దు చేయకుంటే ఉద్యమం ఉదృతం చేస్తాం.. బీఆర్టీయూ హెచ్చరిక
కార్మికులు 8 గంటల నుండి పది గంటల పాటు పని సమయాన్ని పెంచుతూ విడుదల చేసిన 282ని తక్షణం రద్దు చేయాలని , లేని పక్షంలో ఉద్యమాన్ని

దిశ, తెలంగాణ బ్యూరో: కార్మికులు 8 గంటల నుండి పది గంటల పాటు పని సమయాన్ని పెంచుతూ విడుదల చేసిన 282ని తక్షణం రద్దు చేయాలని , లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఆర్టీయూ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బుధవారం ఈ మేరకు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, కనీస వేతనాల సలహా మండలి మాజీ ఛైర్మన్పులిమామిడి నారాయణ, మెట్రో వాటర్ వర్స్యూనియన్ జనరల్సెక్రటరీ ఎలమయ్య నాయకత్వంలో రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం అంజయ్య భవన్‌ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా
కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్‌కు వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాంబాబు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు మంచి చేయక పోగా ఉన్న ప్రయోజనాలు, సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఎప్పుడో 1930 సంవత్సరం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్నీ జీఓ 282 ను తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులు కాలరాయడమే అవుతుందన్నారు. నేడు దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో 10 గంటల పనిని ప్రారంభించి అన్ని సంస్థల్లో కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉందన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగులు ఎదురుకొంటున్న పెండింగ్‌లో ఉన్న పిఆర్‌సి, డీఏ లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ పులిమామిడి నారాయణ మాట్లాడతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని, 18 నెల లు కార్మిక శాఖకు మంత్రినే లేడన్నారు. మంత్రి భాద్యతలు తీసుకున్న వెంటనే ఈ నిర్ణయం చెయ్యడం చూస్తుంటే ప్రభుత్వ విధానం కేంద్ర ప్రభుత్వ విధానాలు తూ చ తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తోంని అర్థం అవుతోందన్నారు. వాటర్స్వర్క్స్ జనరల్సెక్రటరీ ఎలమయ్య మాట్లాడుతు 10 గంటల పని వేళలను కార్మిక వర్గం వ్యతిరేకిస్తోందన్నారు. ఈ క్రమంలో కార్మిక హక్కుల కోసం బీఆర్టీయూ ముందుండి పోరాటం చేస్తోందన్నారు. యూనియన్ నాయకులు వేమల మారయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






